Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29-05-2022 నుంచి 04-06-2022 వరకు మీ వార రాశిఫలాలు

Weekly Astrology
, శనివారం, 28 మే 2022 (22:19 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థికస్థితి సామాన్యం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. అంచనాలు ఫలించవు. నోటీసులు అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై తీవ్రప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సోమ, మంగళవారాల్లో ఒక సంఘటన మనస్థిమితం లేకుండా చేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. అనునయంగా మెలగండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికుం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. గృహమార్పు అనివార్యం. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు కొత్త బాధ్యతలు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బిల్డర్లకు కష్టకాలం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవస్థుల సలహా పాటించండి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రతిపాదనలు ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. దంపతులకు కొత్త ఆలోచనలోస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాల్లే కొనసాగించండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వాహనం ఇతరులకి వ్వవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పత్రాలు, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పెద్దలతో సంద్రింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలను గోప్యంగా ఉంచండి. పత్రాలు సమయానికి కనిపించవు. సంతానం విషయంలో మేలు జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. ఎదుటివారి తీరును గమనించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆది, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. పత్రాల రెన్యువల్‍లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వృత్తి, ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
వాగ్దాటితో నెట్టుకొస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. ఆలోచనలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, వృత్తుల వారికి కొత్త పనులు లభిస్తాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికస్థితి ఆశాజనకం. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు సమయం కాదు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలు కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యపరీక్షలు తప్పవు. సంతానం ఉన్నత చదువుల పై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏజెన్సీలు దక్కించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేపడతారు. బిల్డర్లకు కష్టకాలం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. రుణ సమస్యల నుంచి బయటపడతారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ శ్రమ త్వరలో ఫలిస్తుంది. ఆది, మంగళవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-05-2022 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో..