మీరు పాడ్యమి ఆదివారం, కర్కాటక లగ్నము, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. భర్తస్థానాధిపతి అయిన శని శుక్ర, యమునితో కలయిక వల్ల వివాహం ఆలస్యము అవ్వడం కూడా ఒకందుకు మంచిదే అని గమనించగలరు.
2013 డిసెంబరు లోపు ఉత్తరం నుంచి లేక దక్షిణం నుంచి సంబంధం స్థిరపడగలదు. యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా కలిసిరాగలదు ఉమామహేశ్వరులను ఆరాధించడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది.