సుధారాణి గారూ.. చామంతి పూలతో శనిని పూజిస్తే మీకు శుభం
సుధారాణి- కర్నూల్:
, బుధవారం, 6 మార్చి 2013 (17:32 IST)
FILE
సుధారాణి- కర్నూల్:
మీరు పంచమి గురువారం మీనలగ్నము, రేవతి నక్షత్రం మీనరాశినందు జన్మించారు. లగ్నము నందు చంద్ర, రాహువులు ఉండటం వల్ల భర్తస్థానము నందు కేతువు ఉండటం వల్ల, వివాహం కొంచెం ఆలస్యము అవ్వడం మంచిదే అని గమనించండి.
2013 జూన్ నుంచి 2014 మార్చి లోపు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ, పడమర నుంచికానీ సంబంధం స్థిరపడుతుంది. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో శనిని పూజించినా మీకు శుభం కలుగుతుంది.
ప్రతీరోజు ఉత్తరం వైపుగా తిరిగి ఓం షణ్ముఖాయ నమః అంటు 108 సార్లు జపించండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది.
మీరు మీ ప్రశ్నలను ఈ క్రింది మెయిల్ ఐడీకి పంపించండి. [email protected]