మీరు పంచమి సోమవారం, మేషలగ్నము, ఉత్తరబాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. మన:కారకుడైన చంద్రుడు వ్యయము నందు ఉండటంవల్ల మొండితనం, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఉంటాయి. 2014 చివరి వరరు అష్టము శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయడంవల్ల శుభం కలుగుతుంది.
టెక్నికల్ రంగాలలో బాగుగా రాణిస్తారు. మీ 25 లేక 26 సం||ము నందు ప్రభుత్వ రంగసంస్థలలో స్థిరపడతారు. 28 సం||ము వివాహం అవుతుంది. సదాశివుని ఆరాధించడంవల్ల, స్థిరబుద్ధి, విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి చేకూరుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.