మీరు షష్ఠి బుధవారం, ధనుర్ లగ్నము, స్వాతి నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాచి శనిదోషం ఉన్నందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురికాకండి. 2014 మే నుంచి గురు బలం ఏర్పడటంవల్ల, ఆ సమయంలో ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించండి. ఈ శనిదోషానికి నెలకు ఒక శనివారంనాడు 18సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.
ఏదైనా విద్యాసంస్థలలో కానీ, దేవాలయాలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో 'మద్ది' చెట్టును నాటినా సంకల్పం సిద్ధిస్తుంది. 2015నుంచి ఆర్థికంగా ఉన్నతి స్థితిలో స్థిరపడతారు. 2013 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2015 నుంచి 2032 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి