శ్రీను-వరంగల్ :
మీరు ఏకాదశి ఆదివారం, వృషభలగ్నము, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. భాగ్యరాజ్యాధిపతి అయిన శనిని రాహువు పట్టడం వల్ల, శంకకాల సర్పదోషం ఏర్పడటం వల్ల, ఈ దోషానికి శాంతి చేయించండి. 2011 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది.
ఈ శని 2014 నుంచి 2030 వరకు మంచి అభివృద్ధినివ్వగలదు. 2013 లేక 2014 నందు మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు వివాహం అవుతుంది. మీ భార్య పేరుతో వ్యాపారాలు చేసినా కలిసివస్తుంది. ఐశ్వర్యప్రదాత అయిన ఈశ్వరని ఆరాధించండి. శుభం కలుగుతుంది.