శ్రీకాంత్ గారూ ప్రతిరోజూ లక్ష్మీ నారాయణుడిని పూజించండి
శ్రీకాంత్-ఏలూరు:
Advertiesment
FILE
శ్రీకాంత్-ఏలూరు:
మీరు ఏకాదశి, బుధవారం, మేషలగ్నము, చిత్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. ధనస్థానము నందు రవి, బుధులు ఉండటం వల్ల ఆర్థికంగా నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. 2014 చివరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఏడు ఎర్రని ఒత్తులు ఏకం చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేసినా దోషాలు తొలగిపోతాయి.
సంతానస్థానము నందు శని, రాహువులు ఉండటం వల్ల సంతానం నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. 2003 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2014 నుంచి 2019 వరకు యోగాన్ని, తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీరోజూ లక్ష్మీనారాయణుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.