మీరు నవమి ఆదివారం, మీనలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము గురు, చంద్ర, రాహువులు ఉండటం వల్ల, ఈ దోషానికి శాంతి చేయించినా శుభం కలుగుతుంది. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మల్లెపూలతో శనిని పూజించినా మీకు శుభం కలుగుతుంది.
2013 మే తదుపరి మీ అభివృద్ధికి నాంది పలుకుతుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. 2010 నుంచి బుధ మహర్థశ ప్రారంభమయింది. ఈ బుధుడు 2014 నుంచి 2027 వరకు యోగాన్ని అభివృద్ధినివ్వగలదు. లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోగలవు.