శివజ్యోతి గారూ.. 2013 ఆగస్టులోపు మీకు వివాహం అవుతుంది
, శుక్రవారం, 22 జూన్ 2012 (18:36 IST)
శివజ్యోతి మీరు చతుర్ధశి సోమవారం, కుంభలగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ధన, కుటుంబ, వాక్ స్థానము నందు శుక్ర, గురు, చంద్ర, రాహువులు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. 2013
ఆగస్టు లోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యుడు, ఉత్తముడు అయిన భర్త లభిస్తాడు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం కలుగుతుంది. 2016 నుంచి మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది.