మీరు చతుర్థశి శనివారం సింహలగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు వుండి, భర్తస్థానాధిపతి అయిన శనిని రాహువు పట్టడం వల్ల అనంతనాగ సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. 2013 చివరి వరకు భార్య, భర్తల మధ్య చికాకు, ఆందోళన వంటివి ఉండగలవు.
2014 తదుపరి మీ కుటుంబ సమస్యలు పరిష్కరింపబడవచ్చు. లేనిచో పునర్వివాహానికి 50 శాతం మాత్రమే ఆస్కారం ఉంది. ఇది కూడా అనుకున్నంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం, 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపుశంఖుపూలతో శనిని అర్చించినా శుభం కలుగుతుంది.