మీరు ఏకాదశి సోమవారం వృశ్చిక లగ్నము, స్వాతి నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది.
రాజ్యస్థానము నందు గురు, శని, కుజులు ఉండటం వల్ల, మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2007 నుంచి శని మహార్థశ ప్రారంభమయింది. ఈ శని 2013 నుంచి 2026 వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. ఈశ్వర ఆరాధన వల్ల మీకు సర్వదా శుభం కలుగుతుంది.