వేలూరి నాగార్జునా.. మీరు ప్రతిరోజూ హనుమాన్ ఆరాధన చేయండి
, మంగళవారం, 20 నవంబరు 2012 (17:06 IST)
వి. నాగార్జున మీరు త్రయెదశి శనివారం, సింహలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 19 జెమ్మి సమిథలను సాయిబాబా గుడిలో ఉండే దునిలో వేయండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది. 2013
లేక 2014 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు అని గమనించండి. మీ 27 లేక 28 సంవత్సరం నందు శుక్ర మహర్థశ 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ప్రతీ రోజు హనుమాన్ ఆరాధన చేయండి. ఆటంకాలు తొలగిపోతాయి.