వెంకట శ్రీకాంత్ గారూ.. నూపూలతో శనిని పూజించండి..
, మంగళవారం, 31 జులై 2012 (17:20 IST)
వెంకట శ్రీకాంత్:మీరు ఏకాదశి బుధవారం మకరలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నూపూలతో శనిని పూజించండి. భాగ్యస్థానము నందు కుజ, శుక్రులు ఉండటం వల్ల ధనం బాగా సంపాదించినా నిలబెట్టలేకపోతారు. స్థిరాస్తుల రూపంలో అభివృద్ధి చేయండి. కలిసివస్తుంది. ఈశ్వర ఆరాధన వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 2011 నుంచి కేతు మహర్ధశ ప్రారంభమైంది. ఈ కేతువు 2013 అక్టోబర్ నుంచి 2018 వరకు యోగాన్ని, 2018 నుంచి శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు.