మీరు నవమి శుక్రవారం తులాలగ్నము, రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధన భార్యస్థానాధిపతి అయిన కుజుడు పంచమము నందు ఉండటం వల్ల, వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదు.
మీ 31 లేక 32వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2013 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ప్రతిరోజూ ఈ శ్లోకాన్ని 16సార్లు చదవండి. ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.
"గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీదక్షణామూర్తయే నమః"