మీరు పంచమి సోమవారం, కర్కాటలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి. అలాగే నెలకు ఒక శనివారం నాడు సాయిబాబా గుడిలో ఉండే దునిలో 19 జెమ్మి సమిధలను వేసినా దోషాలు తొలగిపోతాయి.
భర్తస్థానము నందు రవి, బుధులు ఉండటం వల్ల, వివాహ విషయంలో అప్రమత్తత చాలా అవసరం. 2012 ఆగస్టు నుంచి 2013 ఆగస్టు లోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. ప్రతీరోజు సాయిబాబాను ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.