వి. శివవేణుగోపాల్ గారూ.. ఈశ్వర ఆరాధన చేయండి.
, మంగళవారం, 10 జులై 2012 (18:13 IST)
వి. శివవేణుగోపాల్-అవనిగడ్డ:మీరు విదియ శుక్రవారం, కన్యాలగ్నము, అనురాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి సాయిబాబా గుడిలో ఉండే దునిలో 19 జెమ్మె సమిధలను వేసినా దోషాలు తొలగిపోతాయి. లాభస్థానము నందు రాహువు ఉండటం వల్ల విషధారాకాల సర్పదోషం ఏర్పడింది. ఈ దోషానికి శాంతి చేయించినా సర్వదా శుభం కలుగుతుంది. 2013 మే నుంచి కేతు మహర్ధశ ఏడు సంవత్సరాలు, 1020 వరకు తదుపరి శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఈశ్వరుని ఆరాధించడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.