మీరు నవమి ఆదివారం కర్కాటకలగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. వ్యయ స్థానము నందు శుక్ర, కుజ, రాహువులు ఉండటం వల్ల స్థిరాస్తి అమర్చుకునే ప్రయత్నంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారు.
2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా మీకు సర్వదా శుభం కలుగుతుంది. 2013 లేక 2014 నందు గృహ నిర్మాణం చేస్తారు. లలితా పరమేశ్వరుని ఆరాధించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.