మీరు నంది కొమ్ముల నుంచి శివలింగ దర్శనం చేసుకుంటున్నారా!?
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (13:30 IST)
మీరు శివాలయాలకు వెళ్తున్నప్పుడు శివలింగాన్ని ఎలా దర్శించుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నారా? అయితే అది సరైన పద్ధతి కాదని పండితులు అంటున్నారు. సాధారణంగా దర్శనం చేసుకుంటున్నప్పుడు మన దృష్టి గర్భాలయంలోని మూలవిరాట్టుపై లగ్నం చేసుకోవాలి. అందుకే గర్భాలయంలో చిన్న దీపారాధన మాత్రమే వాడతారు. మనం అటు ఇటు చూడకుండా దేవుని వైపు దృష్టిని కేంద్రీకరించడానికే, పూజారి శఠగోపం పెట్టి మన తలను వంచుతాడు. అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూడటం చేయాలి. ఇలా చేయడం కూడా మన దృష్టిని శివునిపై కేంద్రీకరింపజేయడమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా నంది కొమ్ముల నుంచి ఆదిదేవుడిని దర్శించుకోవడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా నంది చెవుల్లో మీ కోరికలు చెప్పే విధానంలోనూ ఒక పద్ధతి ఉంది. మీ కుడిచేతిని నందీశ్వురిని ఒక చెవికి అడ్డం పెట్టి మరో చెవిలో చెప్పడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.