మహాలక్ష్మి గారూ.. 2013 మే తర్వాత మీ భర్తకు మంచి అవకాశాలొస్తాయ్!
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2013 (16:37 IST)
మహాలక్ష్మి:మీరు త్రయోదశి ఆదివారం, వృశ్చికలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉండి, భర్తస్థానాధిపతి అయిన శుక్రుడు లాభము నందు ఉండటం వల్ల మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2013 మే తదుపరి మీ భర్తకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆగష్టు తదుపరి మార్పు, అభివృద్ధి పొందుతారు. ఈ సంవత్సరము ఓర్పు, నేర్పు చాలా అవసరం అని గమనించండి. 2014 నుంచి రవి మహర్థశ 6 సంవత్సరములు, చంద్ర మహర్థశ 10 సంవత్సరములు, కుజ మహర్థశ 7 సం||ములు మంచి అభివృద్ధినిస్తుంది.