బి. నవీన్ కుమార్ గారూ.. అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి
, శుక్రవారం, 8 జూన్ 2012 (18:17 IST)
బి. నవీన్ కుమార్ మీరు దశమి సోమవారం, మేషలగ్నము, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. ధనస్థానము నందు రవి, బుధ, శుక్ర, గురులు ఉండటం వల్ల, మీరు ప్రభుత్వ రంగ సంస్థలతో స్థిరపడతారు. మీ 25 లేక 26 సంవత్సరము నుంచి కలిసివచ్చే కాలం ప్రారంభమవుతుంది. 2012 ఆగస్టుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతున్నందువల్ల 2013 నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. 2013
నుంచి రాహు మహర్ధశ 18 సంవత్సరములు గురు మహర్ధశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.