మీరు అష్టమి శుక్రవారం, కన్యాలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. రవి, శుక్రుడు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. లగ్నము నందు కేతువు ఉండటం వల్ల ప్రతిరోజూ వేంకటేశ్వర సుప్రభాతం చదవండి లేక వినండి మీకు శుభం కలుగుతుంది.
శ్రీ వేంకటేశ్వరుని పున్నాగ పూలతో కానీ, తులసీదళాలతో అర్చించినా శుభం, జయం చేకూరుతుంది. 2006 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 ఆగస్టు నుంచి 2025 లోపు అభివృద్ధిని ఇస్తాడు. 2013 లేక 2014 నందు ఉద్యోగంలో ప్రమోషన్‌లు వంటివి పొందుతారు.