బాలతేజశ్విని... మీరు కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లిచేసుకోకండి
, గురువారం, 31 మే 2012 (18:21 IST)
ఎమ్. బాలతేజశ్విని-ముత్తుకూరు మీరు ద్వాదశి ఆదివారం, మేషలగ్నము, స్వాతి నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. విశాఖ నక్షత్రం ఇంకా ప్రవేశించలేదు. మేష లగ్నానికి కుజ దోషం వర్తించదు. మీరు కుజదోషం ఉన్న అబ్బాయిని చేసుకోకుండా ఉండటం మంచిది. కర్కాటక రాశి నందు కుజుడు ఉండటం వల్ల మీకు కుజ దోషం వర్తించదు. 2017
వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా సర్వదోషాలు తొలగిపోతాయి. మీ 22 లేక 23వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. ప్రతీరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది.