మీరు షష్టి మంగళవారం, కర్కాటకలగ్నము, హస్తనక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు బృహస్పతి నీచి పొంది ఉండటంవల్ల భార్యాస్థానాధిపతి అయిన శనిని కేతువు పట్టడంవల్ల, వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి.
2014 మార్చి నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది. ఉమామహేశ్వరులకు కళ్యానం చేయించినా సర్వ ఆటంకాలు తొలగిపోతాయి.
2014 చివరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. ఏదైనా విద్యాసంస్థలలో కానీ, దేవాలయాలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో 'కుంకుడు' చెట్టును నాటినా సర్వదా శుభం కలుగుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి