ప్రదీప్ కుమార్ - బెంగుళూరు:
మీరు తదియ బుధవారం, మీనలగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా మీ దోషాలు తొలగి అభివృద్ధి చెందుతారు.
ఒక సంబంధం అనుకొని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మీ 26 లేక 27 సంవత్సరాల నందు వివాహం అవుతుంది. విద్యావంతురాలైన భార్య లభిస్తుంది. ఈశ్వర ఆరాధన వల్ల అభివృద్ధి చెందుతారు. 2015 నుంచి శుక్ర మహర్థశ 20 సంవత్సరములు మంచి అభివృద్ధి పొందుతారు.