మీరు అష్టమ బుధవారం మేషలగ్నము, పునర్వసు నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. అర్ధాష్టమ శనిదోషం ప్రభావం ఉండటం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోతున్నాయి. ప్రతీ శనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి.
సాయిబాబా గుడిలో ఉండే దునిలో మూడు లేక నాలుగు రావి సమిధలను వేయండి. మీకు శుభం కలుగుతుంది. 2013 నందు మీరు మంచి సంస్థల్లో స్థిరపడతారు. మీ సంకల్పం సిద్ధిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడే అవకాశం ఉంది.