పి. వెంకటదినకర్ గారూ.. శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి..
పి. వెంకటదినకర్-విశాఖపట్నం
Advertiesment
FILE
పి. వెంకటదినకర్-విశాఖపట్నం
మీరు చతుర్థశి గురువారం, తులా లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. 2014 చివరివరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చేసే వ్యాపారాలలో ఏకాగ్రత వహించి ముందుకు సాగండి. ఒక్కోసారి ఆటంకాలు, సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. నెలకు ఒక శనివారంనాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలశంఖుపూలతో శనిని అర్చించినా దోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీ రోజు 19 సార్లు పఠించినా దోషాలు తొలగి వ్యాపారంలో అభివృద్ధి పొందుతారు.
2013 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమయింది. ఈ శుక్రుడు 20 సం||ములు ఆర్ధికాభివృద్ధి పురోభివృద్ధినిస్తాడు. 2015 నుంచి ఈ యోగం మీకు కానవస్తుంది. మీరు చేసే వెంచర్లు, ఎడ్ వెంచర్లలో జయం చేకూరుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి