Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పి.కొండలరావు - గూడూరు... దేవదారు చెట్టును పెంచండి... శుభం

Advertiesment
భవిష్యవాణి
, శనివారం, 7 డిశెంబరు 2013 (14:31 IST)
WD
మీరు తదియ ఆదివారం, మకర లగ్నము, కృత్తికా నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల, అనంతనాగ సర్పదోషం ఉంది. దీనికి శాంతి చేయించిన సర్వ ఆటంకాలు తొలగి పురోభివృద్ధి పొందుతారు. మీకు తూర్పు, దక్షిణ ముఖాలు కల గృహం కలసివస్తుంది. ఇపుడున్న ఇంటికి ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నదేమో గమనించండి.

2011 నుంచి గురు మరర్దశ ప్రారంభమయింది. ఈ గురువు 2014 మే నుంచి 2027 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ఆర్థికంగా ఉన్నతస్థితిలో స్థిరపడతారు. ఏదైనా దేవాలయంలో కానీ, లేదంటే విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ దేవదారు చెట్టును నాటి దాని అభివృద్ధికి కృషి చేస్తే మీకు శుభం కలుగుతుంది. తేలిక రంగు దుస్తులు మీకు ఎల్లవేళలా శుభం. ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానరాగలదు.

Share this Story:

Follow Webdunia telugu