నాగరాజు గారూ.. మీకు అక్టోబర్ నుంచి సత్కాలం ప్రారంభమవుతోంది...
నాగరాజు
Advertiesment
, సోమవారం, 28 మే 2012 (18:17 IST)
FILE
నాగరాజు
మీరు అమావాస్య ఆదివారం, వృషభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. అక్టోబర్ నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది.
భార్యస్థానాధిపతి అయిన కుజుడు గురు, శని, రాహువుతో కలయిక వల్ల, కళత్రకారకుడైన శుక్రుడు వ్యయము నందు ఉండటం వల్ల, ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలించలేదు.
ప్రతీరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. 2010 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 ఆగస్టు నుంచి 2027 వరకు యోగాన్ని ఇస్తాడు. ప్రతీరోజు పది నిమిషాలు ధ్యానం చేయండి.