నా జాతకం, వివాహం వివరాలు చెప్పగలరు...
, శనివారం, 25 ఫిబ్రవరి 2012 (17:06 IST)
ఎమ్. సుధారాణి - కర్నూలుమీరు పంచమి గురువారం మీన లగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్ర రాహువులు ఉండటం వల్ల, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ధనస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల, మీ 24 సంవత్సరము నుండి మీకు బాగా కలిసిరాగలదు. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించండి. మీ 24 లేక 25వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. మంచి యోగ్యుడు, విద్యావంతుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. అనంతనాగ సర్పదోష శాంతి చేయించండి. 2001 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2013 నుంచి 2021 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. 2014 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.