Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్గ.. మీ అక్కగారికి సంతాన దోషం ఏర్పడింది.. శాంతి హోమం చేయించండి

దుర్గ.. మీ అక్కగారికి సంతాన దోషం ఏర్పడింది.. శాంతి హోమం చేయించండి
, శుక్రవారం, 15 మార్చి 2013 (18:37 IST)
FILE
దుర్గ :

మీ బావగారు సాయి : షష్ఠి, శుక్రవారం, తులాలగ్నం, విశాఖనక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల పాతక కాలసర్పదోష శాంతి చేయించండి శుభం కలుగుతుంది.

సంతానస్థానాధిపతి అయిన శని వ్యయము నందు ఉండటం వల్ల, 2016 లోపు సంతానం కలిగే అవకాశం 50 శాతం మాత్రమే ఉన్నది. పుత్రగణపతి, సంతాన వేణుగోపాలం వంటివి చేసి, వైద్యుని సలహా పాటించినా సర్వదాశుభం కలుగగలదు.

మీ అక్క : రుచిత గారు చవితి బుధవారం, సింహలగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల మీది, మీ భర్తది ఏకరాశి అవ్వడం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించండి.

సంతాన స్థానము నందు వరుణుడు ఉండి, సంతానం స్థానాధిపతి అయిన బృహస్పతి నీచి పొంది ఉండటం వల్ల, సంతాన దోషం ఏర్పడింది. 2015 లోపు సంతానం కలిగే అవకాశం ఉంది. మీ ఇద్దరూ సంతానం వేణుగోపాలం, పుత్రగణపతి వంటి శాంతి హోమం చేయించి వైద్యుని సలహా తీసుకున్నా మీ సంకల్పం సిద్ధిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu