తులసి గారూ.. మీకు 2014 ఫిబ్రవరి లోపు వివాహం అవుతుంది
తులసి- కోల్ కతా :
, గురువారం, 14 మార్చి 2013 (18:35 IST)
FILE
తులసి -కోల్ కతా :
మీరు చతుర్ధశి, శుక్రవారం, మకరలగ్నం, విశాఖనక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, నీలపు శంకుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.
భర్తస్థానము నందు బృహస్పతి ఉచ్ఛ చెందటం వల్ల, భర్తస్థానాధిపతి అయిన చంద్రుడు నీచపొంది ఉండటం వల్ల, కుటుంబ స్థానము నందు కేతువు ఉన్నందువల్ల వివాహాం మీకు ఆలస్యం అయింది.
కర్కోటక కాలసర్పదోష శాంతి చేయించిన సర్వదోషాలు తొలగిపోతాయి. 2014 ఫిబ్రవరి లోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు.