తిరుమల లక్ష్మీ నరసింహరావు గారూ.. ఆదిత్యుడిని ఎర్ర మందారాలతో పూజించండి
, గురువారం, 8 నవంబరు 2012 (18:13 IST)
తిరుమల లక్ష్మీ నరసింహరావు - కందుకూరు: మీరు త్రయోదశి శనివారం, సింహ లగ్నము, కృత్తికా నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ధనస్థానము నందు, వాక్ స్థానము నందు శని కుజులు ఉండటం వల్ల తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. ఆదిత్యుడిని ఎర్ర మందారాలతో పూజించడం వల్ల అభివృద్ధి పొందుతారు. 2003 నుంచి రాహు మహర్దశ ప్రాంభమయింది. ఈ రాహువు మీకు అర్థయోగప్రదుడు అగుట వల్ల 2013 నుంచి 2021 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తాడు. స్టార్ రూబి అనే రాయిని ధరించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. మీ కుమారుడు చతుర్థశి శనివారం, కర్కాటక లగ్నము, స్వాతి నక్షత్రం తులా రాశినందు జన్మించాడు. అష్టమ స్థానము నందు వరుణుడు ఉండటం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్యములో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించినా శుభం కలుగుతుంది. రాజ్యస్థానము నందు రవి, గురులు ఉండటం వల్ల చదువుల్లో బాగుగా రాణిస్తారు. వైద్య రంగాలలో బాగుగా అభివృద్ధి చెందుతారు. 24 లేక 25 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు. 26 లేక 27 నందు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 28 లేక 29 నందు వివాహం అవుతుంది. శారదాదేవిని ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.