జి.రాజేష్ గారూ.. 2014 మే తదుపరి మీకు వివాహం అవుతుంది
జి.రాజేష్- చిత్తూరు:మీరు షష్టి సోమవారం, మేషలగ్నము, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు యముడు ఉండటంవల్ల, భార్యస్థానాధిపతి అయిన శుక్రుడ్ని కేతువు పట్టడంవల్ల వివాహం మీకు ఆలస్యము అయింది. 2014 మే తదుపరి మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి. 2012
నుంచి కుజ మహర్థశ ప్రారంభమయింది. ఈ కుజుడు 2015 నుంచి 2019 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి రాహు మహర్థశ 18సం||ములు నుంచి మంచి అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీ రోజూ ఈ క్రింది శ్లోకాన్ని తూర్పు, ఈశాన్యం వైపుగా తిరిగి 20 సార్లు పటించినా సర్వదా శుభం కలుగుతుంది. శ్రీ చక్రాఖ్య సురమ్య దివ్యనగరే చింతామణీ మందిరే మధ్యే హైమ మహార్ఘరత్న ఖచితే సంహాసనే సంస్థితామ్| శ్రీమత్పంచదశాక్షరాన్విత మన:సౌభాగ్య విద్యేశ్వరీం దేవీం నౌమి సదా మదీయ జననీం శ్రీ రాజరాజేశ్వరీమ్||గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి