గణేష్.. మీరు 18 వత్తులు, నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి
, శుక్రవారం, 23 నవంబరు 2012 (18:18 IST)
గణేష్మీరు చవితి గురువారం, మిథునలగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, 3 నెలలకు ఒక శనివారంనాడు 18 సార్లు నవగ్రహ ప్రదక్షణం చేసి 18 వత్తులు ఏకం చేసి నువ్వులు నూనెతో శనికి దీపారాధన చేసినా శుభం కలుగుతుంది. లగ్నానికి గురువీక్షణం వల్ల, మంచి మంచి అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోతూ ఉంటాయి. ఈ దోషానికి గజలక్ష్మీదేవిని తెల్లని పూలతో ఆరాధించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది. 2006 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2014 నుంచి 2025 వరకు మంచి అభివృద్ధిని ఇవ్వగలదు.