Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటేశ్వరరావుగారు... 54 రకాల మూలికలతో శాంతి హోమం చేయించండి

Advertiesment
డాక్టర్ రామన్
, సోమవారం, 4 మార్చి 2013 (19:46 IST)
FILE
మీరు దశమి ఆదివారం, మిథున లగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. ఏల్నాటి శనిదోషం తొలగిపోయింది. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల రాజ్యాధిపతి అయిన బృహస్పతి కేతువు పట్టడం వల్ల భాగ్యాధిపతి అయిన శని రవి బుధులతో కలిసి హస్తగతం అయిపోవడం వల్ల, శేషనాగ సర్పదోషం ఏర్పడటం వల్ల, ఈ దోషాలకు 54 రకాల మూలికలతో శాంతి హోమం చేయించి దానాలు ఇచ్చినా శుభం కలుగుతుంది.

ప్రతీరోజు కనకధార స్తోత్రం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయాల్లోని గాని, విద్యాసంస్థల్లో గాని, ఖాళీ ప్రదేశాల్లో గాని మఱ్ఱిచెట్టును నాటినా మీకు కలిసిరాగలదు. 2014 నుంచి చంద్ర మహర్థశ 10 సంవత్సరములు, కుజ మహర్థశ 7 సం||ములు మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలడు.

Share this Story:

Follow Webdunia telugu