కె. గోవర్ధన రెడ్డి.. మీకు 28 సంవత్సరంలో వివాహం అవుతుంది
, శుక్రవారం, 23 నవంబరు 2012 (18:16 IST)
కె. గోవర్థన రెడ్డి-రామగిరిమండలం:మీరు సప్తమి గురువారం, మేషలగ్నము, పూర్వాభాద్రా నక్షత్రం. కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు బృహస్పతి ఉండి, చంద్ర బలం అధికంగా ఉన్నందువల్ల 2012 లేక 2013 నందు మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.మీ 27 లేక 28 సంవత్సరముల నుంచి పురోభివృద్ధి కానవస్తుంది. 2016 నుంచి బుధ మహార్థశ 17 సంవత్సరములు, కేతు మహార్థశ 7 సంవత్సరముల నుంచి మంచి అభివృద్ధిని ఇవ్వగలదు. మీ 27 లేక 28 సంవత్సరముల నందు వివాహం అవుతుంది. వివాహనంతరం మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. లక్ష్మీనారాయుణుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.