కె. కార్తీకేయ-హిందూపూర్:
మీరు పంచమి మంగళవారం, కర్కాటక లగ్నము, పునర్వసు నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టుతో అర్ధాష్టమ శనిదోషం తొలగిపోతుంది. ఈ శనిదోషం వల్ల అందరికీ సహాయం చేసి మాటపడటం, అపవాదులు, తలపెట్టిన పనిలో అవాంతరాలు, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. భార్యస్థానాధిపతి అయిన శని, లాభాధిపతి అయిన శుక్రునితో కలయిక వల్ల వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదు.
మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2000 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2013 నుంచి 2019 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలదు. 2013 లేక 2014 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి, సంకల్పసిద్ధి గణపతిని పూజించండి. మీకు అన్నివిధాలా కలిసిరాగలదు.