ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నది...
, బుధవారం, 11 జనవరి 2012 (12:00 IST)
రామన్-అంబాజీపేట:మీరు ఏకాదశి బుధవారం, కన్యాలగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాట శనిదోషం అధికంగా ఉన్నందువల్ల అందరికీ సహాయం చేసి మాటపడటం, మంచి మంచి అవకాశాలు చేజార్చుకోవడం, ఊహించని ఖర్చులు, అశాంతి వంటివి ఎదుర్కొంటున్నారు. నెలకు ఒక శనివారంనాడు 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2013 నందు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2016 నుంచి శని మహర్థశ 19 సం||ములు మంచి అభివృద్ధిని ఇస్తుంది. పరమేశ్వరుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.