మీకు సప్తమి సోమవారం, కర్కాటకలగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల శ్రీకాళహస్తిలో పూజ చేయించండి. ధనస్థానము నందు శుక్రుడు ఉండటంవల్ల వరసిద్దివినాయకునికి ఆవుపాలతో అభిషేకం చేయించండి. ప్రతీ రోజు వరసిద్దివినాయకుని గరికతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.
2004 నుంచి గురు మహార్థశ ప్రారంభమయింది. ఈ గురువు 2014 నుంచి 2020 వరకు యోగాన్ని ఇవ్వగలదు. తదుపరి శని మహార్థశ 19 సంవకత్సరముల మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ఆరోగ్యములో మెళకువ అవసరం. 2019 వరకు సామాన్యంగా ఉన్నా 2019 నుంచి శని మహర్థశ 19 సంవత్సరాలలో మంచి యోగాన్ని ఇస్తుంది.
2014 చివరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్ర గులాబీలతో శనిని పూజించినా మీకు శుభం కలుగుతుంది.