ఇంద్రాణి మీరు ఉమామహేశ్వరులను పూజించండి
, గురువారం, 12 జులై 2012 (17:38 IST)
ఇంద్రాణి-చిత్తూరు: మీరు అష్టమి బుధవారం మిథునలగ్నము, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు వుండి, భర్తస్థానము నందు కేతువు ఉండటం వల్ల వివాహం మీకు ఆలస్యమైంది. మీ 31 లేక 32 సంవత్సరము నందు వివాహము కాగలదు. యోగ్యుడైన భర్త లభిస్తాడు.2019
వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం నాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సువర్ణగన్నేరు పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2010 నుంచి రవి మహర్ధశ ప్రారంభమైంది. ఈ రవి 2013 నుంచి 2016 వరకు యోగాన్ని, తదుపరి చంద్ర మహర్ధశ పది సంవత్సరాలు, కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీరోజూ ఉమామహేశ్వరులను పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.