మీరు నవమి ఆదివారం, కన్యాలగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. లాభస్థానము నందు శుక్రుడు ఉండటం వల్ల మీరు విదేశాల కంటే స్వదేశంలోనే బాగా రాణిస్తారు. తాత్కాలికంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నా భవిష్యత్తులో మీరు వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు.
కృషి మూలం మిథం ధనం అన్నట్లుగా మీరు కృషి చేయడం వల్ల ఉన్నత పదవుల్లో స్థిరపడతారు. 2010 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2012 సెప్టెంబర్ నుంచి 2026 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. ఇష్టకామేశ్వరీదేవిని పూజించడం వల్ల మంచి అభివృద్ధి కానవస్తుంది.