Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబోయ్ శనిదోషం... దోష ఫలితాలు, నివారణ మార్గాలు....

Advertiesment
shani dosham
, శనివారం, 12 మార్చి 2016 (14:41 IST)
శని దోషం ఉందని తెలిసనపుడు దోష నివారణ మార్గాలు అనుసరించాల్సిందే. తీవ్ర వ్యాధులకు కారకుడు శని గ్రహం అని చెపుతారు. చాలా వ్యాధులకు ఏదో రూపంలో శని సంబంధం కలగడం కనిపిస్తుంది. పక్షవాతం, నొప్పులు, ఆస్తమా, లివర్ వ్యాధులు, నిమోనియా, దగ్గు, క్షయ, కిడ్నీ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఎముకలు, చర్మవ్యాధులు, కేన్సర్, టి.బి, వెంట్రుకలు, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు మరియు లోపాలు శనిగ్రహ దోషం వల్ల వచ్చే వ్యాధులు. 
 
సేవకులతో వైరం, శరీర అవయవ లోపం, కోమా లోనికి పోవటం, నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం ఇలా ఒకటేమిటి అన్నివ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహ దోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నివారణ క్రియలు తప్పక అవలంభించాలి
 
శనివారం నాడు ప్రజాపతి, శని మంత్రాలను జపించి, నీలమణిని ధరించుటవలన శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. నల్లని వస్త్రధారణ నల్లని వస్తువులు దానం చేయటం మంచిది. 
 
శ్రీవేంకటేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధన, అయ్యప్ప స్వామి దీక్ష కూడా శనిగ్రహ దోషాలకు మంచి పరిహారాలు. నీలం రత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. నీలం చల్లని వయెలెట్ కాస్మిక్ కిరణాలను కలిగి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu