Publish Date: Thu, 03 Dec 2015 (21:35 IST)
Updated Date: Thu, 03 Dec 2015 (21:39 IST)
సిహెచ్ శరవణ్ కుమార్- వరంగల్: మీరు తదియ ఆదివారం, వృషభ లగ్నము, శ్రవణా నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడి ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల శేషనాగ సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించినా శుభం కలుగుతుంది. 2016 నందు మీకు మంచి అవకాశం లభిస్తుంది. 2017 నందు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ప్రభుత్వరంగ సంస్థలలో కంటే కార్పొరేట్ సంస్థలలో మీరు బాగుగా రాణిస్తారు. శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది. 2011 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2027 వరకు యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. వైష్ణవాలయాలలో తెల్లజిల్లేడు చెట్టును నాటిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.