Publish Date: Tue, 24 Nov 2015 (17:35 IST)
Updated Date: Tue, 24 Nov 2015 (17:38 IST)
ఎం.ఉమారాణి-సికింద్రాబాద్: మీరు అష్టమి ఆదివారం, మేష లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. మీరు ప్రభుత్వరంగ సంస్థలలో కంటే కార్పొరేట్ సంస్థలలో బాగుగా రాణిస్తారు. ప్రతిరోజు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది. 2009 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2027 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2016 మార్చి నెల తదుపరి నుంచి డిసెంబరు లోపు ఆకస్మికంగా వివాహం అవుతుంది. యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.