రామకృష్ణ-వైజాగ్: మీ కుమార్తె షష్ఠి ఆదివారం, మకర లగ్నము, కృత్తిక నక్షత్రము, వృషభ రాశి నందు జన్మించారు. భర్త స్థానాధిపతి అయిన చంద్రుడు పంచమము నందు ఉండటం వల్ల కుటుంబాధిపతి అయిన శని యముడితో కలియక వల్ల వివాహం విచ్ఛిన్నమైంది. 2017 ఆగస్టు లోపు మీ కుమార్తెకు పునర్వివాహం అవుతుంది.
2001 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2019 వరకు మీకు సామాన్యమైన యోగాన్ని ఇవ్వగలదు. తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించినా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఉద్యానవనాల్లో అత్తి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.