శ్రీనివాస రావు.ఎ-విశాఖపట్నం: మీరు చవితి సోమవారం, కన్యా లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. 2011 నవంబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు మీకు 50 శాతం యోగాన్ని ఇస్తాడు.
2016 నందు మీ అభివృద్ధికి మంచి అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోండి. 2017 నుంచి 2029 వరకూ మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. బాలత్రిపుర సుందరిని ఆరాధించడం వల్ల మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. దేవాలయాలలో నిమ్మ చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.