నాగ వెంకట రామసత్య సుధీర్-భీమవరం: మీరు చవితి ఆదివారం, మేష లగ్నము, పునర్వసు నక్షత్రం మిధున రాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని గమనించండి. చంద్ర బలం బాగుగా ఉండటం వల్ల మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. తేలిక రంగు దుస్తులు మీకు ఎల్లవేళలా శుభం. వెంకటేశ్వరుని తులసీదళాలతో పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. 2010 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2017 జూలై నుంచి 2027 వరకూ యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. దేవాలయాలలో దేవగన్నేరు చెట్టును నాటిని మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.