Publish Date: Tue, 08 Dec 2015 (14:13 IST)
Updated Date: Tue, 08 Dec 2015 (14:17 IST)
కె.సాయికుమార్-హైదరాబాద్: మీరు పంచమి మంగళవారం, మిథునలగ్నము, కృత్తికా నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. 2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 9సార్లు నవగ్రహ ప్రదక్షణ శనిని ఎర్రని పూలతో పూజించి, అర్చించినట్లయితే మీకు సర్వదోషాలు తొలగిపోతాయి. ఆదిత్యుడిని పూజించడం వల్ల మనోసిద్ధి చేకూరుతుంది. 2008 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2026 వరకూ ఆర్థికాభివృద్ధిని, పురోభివృద్ధిని ఇస్తుంది. 2016 నందు మీరు బాగుగా స్థిరపడతారు. 2016 లేక 2017 నందు మీకు ఆకస్మికంగా వివాహమవుతుంది. వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. విద్యావంతురాలు, ఉత్తమురాలు, యోగ్యురాలైన భార్య మీకు లభిస్తుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.