Publish Date: Tue, 10 Nov 2015 (22:27 IST)
Updated Date: Tue, 10 Nov 2015 (22:28 IST)
నాగరాజు-యుఎస్ఎ: మీరు పంచమి ఆదివారం సింహలగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ఉద్యోగ స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల 2015 డిసెంబరు తదుపరి మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 2016 ఫిబ్రవరి తదుపరి మీరు బాగుగా స్థిరపడ్డారు. 2016 లేక 2017 నందు సంతానయోగం ఉంది. 2013 అక్టోబరు నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 16 సంవత్సరములు 61 శాతం యోగాన్ని ఇస్తుంది. 2016 నుంచి 2029 వరకూ యోగాన్ని అభివృద్ధిని పొందుతారు. విదేశాలలో కన్నా స్వదేశంలో బాగుగా అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ సూర్యస్తుతి చేయండి. శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.