Publish Date: Thu, 29 Oct 2015 (21:28 IST)
Updated Date: Thu, 29 Oct 2015 (21:30 IST)
జి.ప్రవీణ్-ఖమ్మం: మీరు చవితి శనివారం, మిథున లగ్నం, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. 2017 వరకూ అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని గులాబీ పూలతో శనిని పూజించి, అర్చించండి. భార్య స్థానము నందు బుధ, శుక్ర, గురులు ఉండటం వల్ల వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2016 నందు మీకు వివాహం అవుతుంది. 2015 నుంచి కుజ మహర్దశ ప్రారంభమైంది.
ఈ మహర్దశలో మీకు పితృ వియోగం జరిగింది. ఈ కుజుడు 2016 నుంచి 2022 వరకూ అభివృద్ధిని ఇస్తాడు. మీ తల్లిగారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. సింధూర గణపతిని పూజించి, అర్చించడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఏదైనా ఉద్యానవనంలో మోదుగ చెట్టును నాటిన పురోభివృద్ధి పొందుతారు.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.